ప్రభుత్వ విప్ నకు శుభాకాంక్షలు
విశ్వoభర, చిట్యాల: తెలంగాణ ప్రభుత్వ విప్ గా నియమితులైన నకిరేకల్ నియోజకవర్గ శాసనసభ్యులు వేముల వీరేశంనకు మండల గ్రామ శాఖ కాంగ్రెస్ నాయకులు ఆయన నివాసంలో కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలిపినవారిలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్ర వినోద మోహన్ రెడ్డి, చిట్యాల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీ నర్సింహ, సుంకేనపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు యాకారి లింగస్వామి, ఎలికట్టే గ్రామశాఖ అధ్యక్షులు నాగార్జున యాదగిరి,వెలిమినేడు గ్రామశాఖ అధ్యక్షులు సరకంటి సత్తి రెడ్డి,ఏపూర్ గ్రామశాఖ అధ్యక్షులు పాలెం కృష్ణ,పిట్టంపల్లి గ్రామశాఖ అధ్యక్షులు మేడి క్రిష్ణయ్య,చిన్నకాపర్తి గ్రామశాఖ అధ్యక్షులు బోయపల్లి వెంకన్న,అరేగూడెం గ్రామశాఖ అధ్యక్షులు నాగంపల్లి కిషోర్,పెద్దకాపర్తి గ్రామశాఖ అధ్యక్షులు నిలకంఠం లింగస్వామి,వనిపాకల గ్రామశాఖ అధ్యక్షులు జల యాదయ్య, వటిమర్తి గ్రామశాఖ అధ్యక్షులు మేడి శ్రీను,వెంబయి గ్రామశాఖ అధ్యక్షులు గురిజ మహేష్ గౌడ్, శేఖర్ తదితరులు ఉన్నారు.



