యాదవుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

యాదవుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

  •  దాసరి అజయ్ కుమార్ యాదవ్

విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ యాదవ జేఏసీ స్టేట్ చైర్మన్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మ్యాకల శివశంకర్ యాదవ్  అధ్యక్షతన, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు చింతకుంట శ్రీనివాస్ యాదవ్  సమక్షంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ యాదవ జేఏసీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ గౌరవ అధ్యక్షులుగా సుద్దుల సుధాకర్ యాదవ్, అధ్యక్షుడిగా బత్తుల బచ్చన్న యాదవ్, ఉపాధ్యక్షులుగా నక్క మల్లేష్ యాదవ్, బర్ల వెంకటస్వామి యాదవ్, దాసరి నిరంజన్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా వసంతం దేవరాజు యాదవ్, కార్యదర్శులుగా గడ్డమీది బుచ్చన్న యాదవ్, బద్దుల రామచంద్రుడు యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బత్తుల బాలరాజు యాదవ్, ప్రచార కార్యదర్శిగా దాసరి శ్రీనివాస్ యాదవ్, కోశాధికారిగా బత్తుల మధు యాదవ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా స్టేట్ చైర్మన్ అజయ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో యాదవ సంఘాలను ఐక్యం చేస్తూ 33 జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు, మండలాలు, గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో కూడా కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కమిటీ ఆధ్వర్యంలో యాదవుల సంక్షేమం కోసం పోరాటం కొనసాగుతుందని అన్నారు.యాదవులు రాష్ట్రంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. గొర్ల కాపరులు మేత కోసం ఇబ్బందులు పడుతున్నారని, రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో యాదవ భవన్‌ను త్వరితగతిన ప్రారంభించాలని, రాష్ట్ర మంత్రివర్గంలో యాదవులకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో యాదవులకు జనాభా ప్రాతిపదికన టికెట్లు కేటాయించాలని, యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌లో యాదవులకు 15 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాదవ జేఏసీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

Tags: