బీజేపీ నాయకుల అరెస్టు అక్రమం
విశ్వంభర, రామన్నపేట: తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ, ప్రజల బతుకులను ఆగం చేస్తూ, భావితరాలకు భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని, అరాచక కమిషన్ల పాలనను నిలదీస్తూ తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు నేతృత్వంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం తలపెట్టిన సందర్భంగా సోమవారం రోజు పోలీసులు రామన్నపేట బిజెపి మండల అధ్యక్షులు బండ మధుకర్ రెడ్డిని, నకిరేకల్ ఇంచార్జ్ నకిరేకంటి మొగులయ్యను ముందస్తుగా వారి ఇంటి దగ్గర అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇలాంటి అక్రమ అరెస్టులకి భయపడేది లేదని, కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అయిన మహిళలకు 2500, రైతులకు రైతుబంధు ఎకరాకు 15000 వేస్తామని వేయకపోవడం, వృద్ధులకు పింఛన్ 4000, ఆడబిడ్డల పెళ్లి చేస్తే తులం బంగారం ఇస్తామనడం, స్కూటీలు పంపిణీ చేస్తామని, ఇలాంటి అనేక మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి హామీలను నెరవేర్చక పోగా ప్రజలని మభ్యపెడుతూ సమయం గడుపుతున్న కాంగ్రెస్ పార్టీ విధానాలని జనాలలోకి బిజెపి తీసుకెళ్లడాన్ని జీర్ణించుకోలేక, ప్రజలలో బిజెపికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక, ఇలాంటి అరెస్టులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయించడం కాంగ్రెస్ దుర్మార్గ పాలనని అంతానికి నాంది అని, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఇలాంటి అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలని ఆపలేరని, ప్రజల కోసం పనిచేయడంలో బిజెపి ఎప్పుడు ముందుంటుందని, ప్రజల పక్షాన ఎల్లప్పుడూ ఉంటామని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. రామన్నపేట మండలంలో అరెస్టు చేసిన వారిలో జిల్లా కౌన్సిల్ మెంబర్ పల్లపు దుర్గయ్య, రాజన్న గారి రమేష్, కొడారి వెంకన్న, సూరి మల్లేష్ తదితరబీజేపీ నాయకులు ఉన్నారు.



