అంబేద్కర్ విగ్రహానికి ఆశా వర్కర్ల వినతి
విశ్వంభర, నెల్లికుదురు: మండలంలోని ఆశా వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరసనలలో భాగంగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. స్కావెంజర్ల సంఘం రాష్ట్ర సభ్యులు ఇసంపెల్లి సైదులు పాల్గొని మద్దతు తెలిపి మాట్లాడుతూ, ఆశా కార్యకర్తలకు నెలనెలారు రూ.18,000 ఫిక్స్ డ్ వేతనం అకౌంట్ల లో వేసి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి సీనియార్టీ ప్రకారం ఏఎన్ఎంలుగా ప్రమోషన్ ఇవ్వాలన్నారు. రూ.50 లక్షలు బీమా వర్తింపచేయాలని, ఆశలు మరణిస్తే దహన సంస్కారాల ఖర్చులకు రూ.50 వేలు చెల్లించాలన్నారు. పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్ల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల జిల్లా అద్యక్షురాలు మహేశ్వరి,ఆదిలక్ష్మి, సుజాత, భాగ్యలక్ష్మి, కవిత మండలంలోని వివిధ గ్రామాల ఆశ వర్కర్లు పాల్గొన్నారు.



