సమాజ అభివృద్ధిలో మహిళలదే కీలక పాత్ర 

సమాజ అభివృద్ధిలో మహిళలదే కీలక పాత్ర 

  • సిఐటియు జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌళి 

విశ్వంభర, మహబూబాబాద్:  జిల్లా కేంద్రంలో సిడిపిఓ కార్యాలయంలో  అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంగన్వాడి మహబూబాబాద్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఘనంగా  జరిగింది .  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఐటీ జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌళి  పాల్గొన్నారు . ఈ సందర్భంగా  కార్యక్రమాన్ని ఉద్దేశించి సమ్మెట రాజమౌళి మాట్లాడుతూ, సమాజంలో సగభాగం ఉన్న మహిళలు ప్రతి రంగంలో పనిచేస్తున్నారని గుర్తు చేశారు . అందుకోసం వారిని గౌరవించవలసిన అవసరం మన  అందరిపై ఉంది అని  అన్నారు .  ప్రపంచవ్యాప్తంగా మహిళా హక్కులను సాధించుకోవడం కోసం పెద్ద ఎత్తున మహిళా పోరాటాలు జరిగినవి అని అన్నారు. భూమి మీద పనిచేసే మహిళలు 70% ఉన్నారు. మహిళల పేరు మీద భూమి ఉన్నది 15% మాత్రమే ఉన్నదని కూలీలో పనిలో మగవానికి ఎక్కువ మహిళకు తక్కువ సమానత్వం ఎక్కడ ఉన్నదని ప్రభుత్వాలను ప్రశ్నించారు . ఇల్లు నడవాలంటే మగవాడు సంపాదిస్తాడు మహిళ ఇంటికే పరిమితం కావాలి. ఇది సనాతన ధర్మం. శ్రమజేసేది మహిళ హక్కు  కాడికి వచ్చేసరికి వెనకపడేది మహిళ ఒక విధమైన దాడి మహిళలపై జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మహిళలపై అఘాయిత్యాలు వరకట్న వేధింపులు బాల్య వివాహాలు ఉద్యోగాలలో వ్యత్యాసం చదువులలో వ్యత్యాసం మహిళా హక్కుల కోసం నిరంతరం సిఐటి యు పోరాటం చేస్తున్నదని అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో అంగన్వాడి జిల్లా కార్యదర్శి స్నేహ బిందు ,  సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి కుంట్ల నాగన్న ,  అంగన్వాడి మహబూబాబాద్ ప్రాజెక్ట్ నాయకులు దార సుజాత ,  గుగులోతు సరోజ. జి సరస్వతి.,  బోడ వినోద. ,బి పద్మ., జ్యోతి. ,భారతమ్మ., తదితరులు పాల్గొన్నారు .

Tags: