ముస్లింల సంక్షేమానికి పెద్దపీట

 ముస్లింల సంక్షేమానికి పెద్దపీట

 విశ్వంభర, సూర్యాపేట: కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని 44వార్డు కౌన్సిలర్ గుణగంటి హేమ సతీష్  అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 44 వార్డులో కౌసర్ మజీద్ ప్రెసిడెంట్ కాజా ఇస్రార్ అహ్మద్ ఆధ్వర్యంలో  రంజాన్ తోఫాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముస్లింలకు సంక్షేమ ఫలాలు అందించడం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. గత ప్రభుత్వాలు మైనార్టీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మైనార్టీల పక్షపాతి అని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన 4 శాతం రిజర్వేషన్ల వల్ల నేడు ఎంతోమంది ముస్లిం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగ రంగాల్లో రాణిస్తున్నారు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, మన్సూర్, ఖదీర్, సోనీ, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.

Tags: