అదనపు కలెక్టర్ సీసీ పై బాధితుల ఫిర్యాదు

అదనపు కలెక్టర్ సీసీ పై బాధితుల ఫిర్యాదు

 విశ్వంభర, నిర్మల్: నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్  సీసీ ముంతాజ్ పై బాధితులు ముఖీమ్ అహ్మద్, సాదిక్ బేగ్ లు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా బాధితులు మాట్లాడుతూ,  ప్రస్తుత సీసీ ముంతాజ్ గతంలో సారంగాపూర్ మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించే సమయంలో అదే మండల గోపాల్ పేట్ గ్రామానికి సంబందించిన కళ్యాణ లక్ష్మి పథకం కోసం డబ్బులు తీసుకురావాలని ఆర్ ఐ ఫైల్ ఇచ్చి పంపారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు బాధితులకు తెలియకుండ మొబైల్ రికార్డు చేసి సారంగాపూర్ తహసీల్దార్ కు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అనంతరం తహసీల్దార్ పోలీస్ల కు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు. ఈ నేపథ్యంలో ఆర్ ఐ మొదట్లో మొఖీమ్, సాదిక్ లను చూసుకుంటానాని హామీ ఇచ్చి చివరికి చేతులు ఎత్తేశారు. సీసీ పై  విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వేడుకొన్నారు.

Tags: