రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం 

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం 

:వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి
: రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ ఎస్.రాములు నాయక్
విశ్వంభర, మహబూబాబాద్:  సోమవారం మహబూబాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ ఎస్.రాములు నాయక్, రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్ పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో విలేకరులతో మాట్లాడారు,  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఇందిరమ్మ ప్రభుత్వమని, రైతుల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వరి పంటనే కాకుండా వాణిజ్య పంటల వైపు రైతులను మళ్ళించే విధంగా వారికి అవగాహన కల్పించాలని అధిక లాభాలు కలిగిన ఆయిల్ పామ్, అంతర్ పంటల వేయడం ద్వారా రైతులు మరింత ముందుకు సాగుతారని తెలిపారు/ మహబూబాబాద్ జిల్లాలో సారవంతమైన నేలలు ఉన్నాయని అందుకు తగిన విధంగా పంటలు వేయాలని ఆర్టికల్చర్, అగ్రికల్చర్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి వారికి అవగాహన కల్పించాలన్నారు. గిరిజన జిల్లా అయిన మహబూబాబాద్ లో క్షణిక ఆవేశంతో గడ్డి మందు సేవించి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తొందరపాటు నిర్ణయాల వలన వారి జీవితాలను అగమ్య గోచరంలో వేసుకోవడం జరుగుతుందన్నారు. గడ్డి మందు నివారణకు కోసం వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ గారిని కలిసి కోరడం జరిగిందని అన్నారు. వివిధ కారణాల వలన ఆర్థికంగా నష్టపోయిన రైతు కుటుంబాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తూ చేదోడువాదోడుగా ఉందని అన్నారు.  నాణ్యమైన విత్తనాలు ఎరువుల ఉత్పత్తికి సంబంధించి ఫర్టిలైజర్ షాపులు ప్రభుత్వం ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. రైతు భరోసా, రైతు బీమా, పెట్టుబడి సహాయం, సన్నవడ్లకు 500 బోనస్, తదితర పథకాలను అందిస్తున్నామని చెప్పారు. ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్ మాట్లాడుతూ,  దేశానికి రైతు ఆదర్శమని రైతుకు సంబంధించి ఎక్కడ లేని విధంగా వారి సంక్షేమం నిమిత్తం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని అన్నారు, జిల్లాలో చిన్న చిన్న కలహాలు, కుటుంబ సమస్యలతో గడ్డి మందు సేవించి చనిపోవడం జరుగుతుందని, అలాంటి తొందర పాటు నిర్ణయాలు తప్పు అని భావించారు,రైతు, ఎస్సీ, ఎస్టీ బహుజనల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు, అధిక మోతాదులో ఎరువులు ఫర్టిలైజర్స్ వినియోగిస్తే భూమి యొక్క సారవంతమైన బలాన్ని కోల్పోవడం జరుగుతుందని, తగిన మోతాదులో మాత్రమే ఎరువులను వినియోగించాలని అన్నారు, రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ సభ్యుల అభివృద్ధి కోసం ఆర్థిక సహాయాలను మంజూరు చేయడం జరుగుతుందని ఎస్సీ ఎస్టీ కమిషన్, రైతు కమిషన్ సభ్యులు వారి కృషి కోసం నిత్యం అందుబాటులో ఉంటారని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో డిఏఓ సరిత, హార్టికల్చర్ అధికారి మరియన్న, జిల్లా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శ్రీనివాస్, ఆర్ఎంవో డాక్టర్ జగదీష్, ఏ డి ఏ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags: