ఘనంగా భగత్ సింగ్ 95వ వర్ధంతి. - ఎస్ కె ఎం
On
విశ్వంభర,మహబూబాబాద్ జిల్లా : భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా విగ్రహం వద్ద ఎస్ కె ఎం ఆధ్వర్యంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి ఎస్.కె.ఎం జిల్లా కన్వీనర్ గుజ్జు దేవేందర్ అధ్యక్షత వహించారు .ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న , ఏఐయుకేస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్న చంద్రన్న , వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరన్న , ఏఐకే మెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలకుంట్ల సాయిల్ , ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కె మదారులు మాట్లాడుతూ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల రద్దుకై పోరాడుదాం , జిల్లా కేంద్రం లోని రైల్వే స్టేషన్ , శ్రీనివాస థియేటర్ వద్ద ఉన్న భగత్ సింగ్ విగ్రహం ఈయన 95వ వర్ధంతిని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు . మరియు వర్ధంతిని పురస్కరించుకొని , సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట స్ఫూర్తిగా తీసుకొని భారత ప్రభుత్వం అమెరికా దేశం అధ్యక్షుడు ట్రంప్ తో యూరోప్ యూనియన్ దేశాలతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు అన్నింటిని వెంటనే రద్దు చేయాలని భగత్ సింగ్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ బ్రిటిష్ , ప్రభుత్వం చే ఉరి తీయబడ్డాడని, కేంద్రాల్లోని నరేంద్ర మోదీ బిజెపి ప్రభుత్వం భారత వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టే అసమాన చీకటి ఒప్పందాలతో అమెరికా దేశం ట్రంప్ తో యూరప్ యూనియన్ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల్ని చేసుకున్నాడని అట్టి ఒప్పందాలని వెంటనే రద్దు చేయాలని యావత్ భారత రైతాంగం డిమాండ్ చేస్తుందని , ఇది రద్దయేంతవరకు ఎస్ కే యం జాతీయ కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తుందనీ , సామ్రాజ్యవాద , వ్యతిరేక పోరాట స్ఫూర్తిని తీసుకొని ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్త , ఉద్యమంగా తీసుకెళ్తామని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో తీసుకువచ్చిన నూతన బివిజి రాంజీ ఉపాధి హామీ చట్టాన్ని 2025 జాతీయవిత్తన బిల్లు 2025 కేంద్ర విద్యుత్ బిల్లులను వెంటనే రద్దు చేయాలనిఢిల్లీ కేంద్రంగా రైతాంగం చేపట్టిన దీక్షలకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతాంగనికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలన్నింటిని వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు . ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ సామ్రాజ్యవాదులు చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం మోడీ విదేశీంగ విధానం సామ్రాజ్యవాదులకు సపోర్టుగా పనిచేస్తుందని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలని విదేశాంగ విధానంలో స్వతంత్రత కలిగి ఉండాలని అమెరికా చెప్పినట్లుగా తోలుబొమ్మ ప్రభుత్వం లాగా ఉండకూడదని సర్వభౌమాధికారం కలిగిన భారతదేశం ప్రపంచంలోనే గర్వంగా ఉండే విధంగా బిజెపి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఉండాలని అమెరికా ఇజ్రాయులకు తొత్తు ప్రభుత్వంగా వ్యవహరించకూడదని వారు కేంద్ర ప్రభుత్వం హెచ్చరించారు ఈ నెల మార్చి 27వ తారీకు నా జిల్లా కేంద్రంలోని పెరుమాళ్ళ జగన్నాథం కార్యాలయంలో ఎస్ కే యం జిల్లా కన్విన్ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు సదస్సు ఉంటుందని ఈ సదస్సుకు రైతు సంఘాలు రైతు కూలి సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొనాలని మార్చి 30న హైదరాబాదులో ఇందిరాపార్క్, వద్ద జరుగు మహా ధర్నాకు రైతు రైతు కూలి సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి గవిని ఐలయ్య , ఏఐకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గునిగంటి రాజన్న, ఆకుల రాజు, దొంతూజు ఉపేంద్ర చారి, కందాల రంగయ్య ,ఉమ్మ గాని సత్యం ,నల్లపు సుధాకర్, తదితరులు పాల్గొన్నారు .



