కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయ హుండీ లెక్కింపు 

కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయ హుండీ లెక్కింపు 

 విశ్వంభర, జిహెచ్ యంసి : ప్రసిద్ధి చెందిన శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానమునకు సంబంధించి గత 145 రోజుల హుండీ ఆదాయం  రూ.63,84,446, విదేశి మారకము 67 యూ.ఎస్. డాలర్లు, 5 ఆస్ట్రేలియా డాలర్లు, 1 మలేషియా రింగిట్, 120 అరబ్ దిర్హాంస్, 10 యు.కే. పౌండ్స్, 100 బంగ్లాదేశ్ టాకాస్, 20 శ్రిలంక రుపీస్, 50 నేపాల్ రూపీస్ వచ్చినట్లు చైర్మన్  ఈదులకంటి సత్యనారాయణ తెలిపారు. హుండీల లెక్కింపులో  దేవాదాయ శాఖ పర్యవెక్షకులుగా హజరైన వెంకట్ ప్రేం కుమార్ రావు, కారనిర్వహణాధికారి గారి పర్యవేక్షణలో, ఆలయ కార్యనిర్వహణాధికారి  యన్. లావణ్య, చైర్మన్  ఈదులకంటి సత్యనారాయణ, ధర్మకర్తలు దిండు ప్రవీణ్ గౌడ్, తోకటి కిరణ్ కుమార్, సింగంశెట్టి శ్రీనివాస్, విష్ణువర్ధన్ రెడ్డి జనుంపల్లి, కుకునూరి గోపాల్ రెడ్డి, పూల నాగరాజు, కె. కవిత, ఓరుగంటి నరేష్, బండిగారి శ్రీనివాస్ గౌడ్, ఎనుముల రవీందర్ రెడ్డి, యం. రాజేశ్వరి ఆధ్వర్యములో ఆలయ అర్చకులు, సిబ్బంది, వివిధ సేవా సంఘాల వాలంటీర్లు పాల్గొన్నారు.

Tags: