వేరేశంనకు శుభాకాంక్షలు
On
విశ్వంభర, రామన్నపేట: ప్రభుత్వ విప్ గా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నియమితులైన సందర్భంగా సోమవారం రోజు హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వేరేశంను యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కాంగ్రెస్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు సిరిగిరెడ్డి మల్లారెడ్డి ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట పి.ఏ.సి.ఎస్ చైర్మన్ నంద్యాల బిక్షంరెడ్డి, జినుకల ప్రభాకర్, జెల్ల వెంకటేష్, పూస బాకిషన్, గుత్తా నర్సిరెడ్డి, శంబాల వెంకన్న, ఎర్ర శేఖర్, నీల మహేష్, టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.



