భగత్ సింగ్ కు ఘనంగా నివాళులు
విశ్వంభర, చేవెళ్ల: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విప్లవ వీరుడు భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు చేవెళ్లలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భగత్ సింగ్ దేశభక్తి, త్యాగస్ఫూర్తిని స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గం నేటి యువతకు మార్గదర్శకమని నాయకులు పేర్కొన్నారు. చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్ రెడ్డి మాట్లాడుతూ, భగత్ సింగ్ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటం, సమాజం కోసం చూపిన త్యాగం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మధుకర్ రెడ్డి, గణేశ్, జైసింహా రెడ్డి, హర్షిత్, రాకేష్, రాఘవేంద్ర చారి, అక్షయ్ తదితరులు, పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.



