ఎరుకలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
:ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు తిరుపతి
విశ్వంభర, బషీర్ బాగ్: రాష్ట్రంలో 8 లక్షల జనాభా కలిగి ఉన్న ఎరుకల ప్రజల కోసం ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నేరవేర్చకపోవడం బాధకరం అని తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు కెమసారం తిరుపతి అన్నారు. సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 3 ఏళ్ళు గడుస్తున్నా మూడవ బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎరుకల కులస్తులకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించక పోవడం దారుణం అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములలో అక్కడక్కడ గ్రామీణా ప్రాంతాల్లో పందులు పెంచుకోవడానికి షెడ్లు నిర్మించుకున్న ఎరుకల కులస్తులపై అగ్రవర్ణాలు దాడులు చేస్తున్నాయని అన్నారు. పందుల పెంపకందారులకు ప్రతి కుంటుంబానికి 5 ఎకరాల భూమి ఇవ్వాలన్నారు. ప్రత్యేక ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలని అన్నారు. ఇండ్లు లేని ప్రతి ఎరుకల కుటుంబానికి 100 గజాల స్థలం కేటాయించి ఇడ్లు కట్టించి ఇవ్వాలన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా ప్రతి ఎరుకల కుటుంబానికి రూ.10 లక్షల ఋణాలు ఇవ్వాలని అన్నారు. 33 జిల్లా కేంద్రంలో ఏకలవ్య విగ్రహం ఏర్పాటు కోసం స్థలం కేటాయించాలన్నారు. ప్రత్యేక ఎస్టీ కమీషన్ ను ఏర్పాటు చేయాలన్నారు. వివిధ శాఖల్లో ఉన్న ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి గా రెవెల్లి ఓదెలు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నేతలు సంపత్, పుష్ప, శేఖర్, కుమారస్వామి, వెంకటేష్, వివిధ జిల్లాల నేతలు సాయిలు, ఎల్లయ్య, ఓదెలు, తిరుపతి, నగేష్, పోచయ్య, శ్రీను, లలిత తదితరులు పాల్గొన్నారు



