నర్కుడ  బిఆర్ఎస్ నూతన కమిటీ ఏర్పాటు

నర్కుడ  బిఆర్ఎస్ నూతన కమిటీ ఏర్పాటు

 విశ్వంభర, శంషాబాద్: శంషాబాద్ మండల పార్టీ అధ్యక్షులు  మంచెర్ల మోహన్ రావు  ఆధ్వర్యంలో నర్కూడ గ్రామంలో బి.ఆర్.ఎస్ పార్టీ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ డైరెక్టర్, శంషాబాద్ మాజీ జెడ్పిటిసి బూర్కుంట సతీష్, శంషాబాద్ మాజీ ఎంపీపీ దిద్యాల జయమ్మ శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు  చిలకమర్రి నరసింహ, మండల్ బీసీ సెల్ అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి గౌస్ పాషా, నర్కుడ బీ ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బుర్కుంట బాబు హాజరై నూతన కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా నర్కూడ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడిగా  చొటా మహేష్ యాదవ్ ని రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా లింగం శ్రీశైలం, మంకాల వినోద్ కుమార్ నియమితులయ్యారు.యువజన విభాగం అధ్యక్షుడిగా ఉదయ్ గౌడ్, ఉపాధ్యక్షులుగా సంతపురి రఘు, బీసీ సెల్ అధ్యక్షుడిగా గాజుల సతీష్, ఉపాధ్యక్షుడిగా బూర్కుంట రాకేష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కే. ప్రమోద్ కుమార్, ఉపాధ్యక్షుడిగా బి. సుధాకర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మండల నాయకత్వం నూతన కమిటీకి బాధ్యతలు అప్పగిస్తూ, గ్రామంలో బి.ఆర్.ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చింది. నూతన అధ్యక్షుడు చోటా మహేష్ యాదవ్ మాట్లాడుతూ,  రాబోయే రోజుల్లో నర్కూడ గ్రామంతో పాటు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బి.ఆర్.ఎస్ పార్టీ జెండాను ఎగరవేయడం ఖాయమని, కార్యకర్తలకు ఎప్పటికప్పుడు అండగా ఉంటామని తెలిపారు.

Tags: