సమస్యలు పరిష్కరించాలని 'ఆశా'ల నిరసన
విశ్వంభర, ఇనుగుర్తి: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు మండల కేంద్రం ఇనుగుర్తిలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. దీనికి సీఐటీయూ మద్దతు ప్రకటిస్తూ ఆ యూనియన్ మండల కార్యదర్శి జల్లె జయరాజ్ పాల్గొని మాట్లాడారు. ప్రజారోగ్య వ్యవస్థకు వెన్నెముకలా పని చేస్తున్న ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేల చొప్పున నెల నెల అకౌంట్లో వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఉద్యోగ భద్రత కల్పిస్తూ,సీనియార్టీ ప్రకారం ఆశా వర్కర్లకు ఏఎన్ఎంలుగా పదోన్నతి కల్పించాలన్నారు.10 లక్షల బీమా సౌకర్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు.ఈ మేరకు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలో నిర్ణయం తీసుకోవాలన్నారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ మండల అధ్యక్షులు ఎడ్ల స్వరూప, కార్యదర్శి రాధ,రమ, శ్రీలత,లక్ష్మి, జి.రమ, లలిత, మంజుల, సుజాత, కవిత, రజిత, సునీత, బుజ్జి, సునీత, మల్లిక, విజయ ,లలిత, వి.సున, జ్యోతి, ఎం.జ్యోతి, మహేశ్వరి, శోభ, పద్మ, రజిత, ఆశ తదితరులు పాల్గొన్నారు.



