భగత్ సింగ్ స్ఫూర్తి యువతకు అవసరం

భగత్ సింగ్ స్ఫూర్తి యువతకు అవసరం

విశ్వంభర, నారాయణగూడ : భగత్ సింగ్ పోరాట స్ఫూర్తిని యువత అలవర్చుకోవాలి, డ్రగ్స్, గంజాయి, మత్తుపానియాలకు దూరంగా ఉండాలని వక్తలు పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ ఐ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన భగత్ సింగ్ వర్ధంతి సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. జిల్లా నాయకులు అశోక్ రెడ్డి, జావీద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముందు నారాయణగూడ నుంచి ర్యాలీ నిర్వహించారు. సభలో పసునూరి శ్రీనివాసరావు, పూజ, కిరణ్ రెడ్డి, విజయ్ కుమార్, మల్లేశ్, కోట రమేష్, మహేందర్ మాట్లాడుతూ భగత్ సింగ్ దేశం కోసం ప్రాణాలర్పించిన మహానుభావుడని గుర్తు చేశారు. యువత సమాజ బాధ్యతను గుర్తించి సరైన మార్గంలో నడవాలని సూచించారు. మత్తు పానీయాలకు బానిసలవుతున్న యువతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం వాటిని కట్టడి చేయాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లెనిన్, రాజయ్య, సునీల్, రజనీకాంత్, ప్రశాంత్, నాగేందర్, అర్జున్, ప్రవీణ్, గోపి, మనోజ్, శ్రీనివాస్ రావు, వెంకటేష్, వాణి, రేణుక, కృష్ణ స్వామి, పాషా, రాములు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Tags: