31న మహావీర్ జయంతోత్సవాలు
విశ్వంభర, బషీర్ బాగ్: తాను గ్రహించిన శాశ్వత సత్యాన్ని ప్రజలకు బోధించిన జైనమత 24వ తీర్థంకరుడైన వర్ధమాన భగవాన్ మహావీర్ 2625వ జయంతోత్సవాలను మార్చ్ 31న సికింద్రాబాద్, ఇంపీరియల్ గార్డెన్స్ లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ మహావీర్ జైన్ సేవ సంఘ్, త్రినగర్, తెలంగాణ కోర్ కమిటీ సభ్యులు ప్రదీప్ ఖురానా, పరస్ ర్యాంక, కిషోర్ ముఠా, మహావీర్ టాటెడ్, జై ప్రకాష్ ముఖాన, విజయ్ సూరన, నేమి ముఖాన, పవన్ పాండియ, సురేష్ బోహ్రా, కైలాష్ మండోత్, ఘేవర్ కొఠారి, దినేష్ జైన్ లు తెలిపారు. సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, భగవాన్ మహావీర్ 2625వ జయంతోత్సవల బ్రోచర్ ను వారు విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ భగవాన్ మహావీర్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 31 తేదీన ఉదయం తొమ్మిది గంటలకు తాడ్ బాన్ హనుమాన్ దేవాలయం నుండి ఇంపీరియల్ గార్డెన్, సికింద్రాబాద్ వరకు మహావీరుని విగ్రహాన్ని అలంకరించిన రథయాత్ర, "వర్గోద" వైభవోపేతమైన ఆధ్యాత్మిక ఊరేగింపు ను నిర్వహిస్తున్నట్లు అనంతరం ఉదయం పది గంటలకు ఇంపీరియల్ గార్డెన్ లో ఉత్సాహభరితమైన ధర్మ సభ జరుగుతుందని తెలిపారు. జంట నగరాల నుండే కాకుండా తెలంగాణ రాష్ట్ర నలుమూలలనుండి వేలాదిమంది జైన భక్తులు హాజరైతారని. పూజ్య జైన సన్యాసులు, సన్యాసినులు ధర్మ సభలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు, శాంతి, కరుణ, వినయం, నిస్వార్థత ఆధ్యాత్మిక జాగృతి సందేశంతో జీవించాలనే లక్ష్యంతో ప్రార్థనలు చేస్తారని, భగవాన్ మహావీరుని బోధనలు జైన తత్వశాస్త్రానికి మూల సూత్రాలుగా ఉన్నా అహింస, సత్యం, అస్తేయ, బ్రహ్మచర్యం, అపరిగ్రహం వంటివి బోధిస్తారని వారు తెలిపారు.



