విద్యార్థులు ఉపాధ్యాయులైన వెేళ

విద్యార్థులు ఉపాధ్యాయులైన వెేళ

విశ్వంభర, సంస్థాన్ నారాయణపురం: ప్రాథమిక పాఠశాల గుజ్జ లో స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.విద్యార్థులు కలెక్టర్ గా ఎర్ర పూజిత, డిఈఒగా ఎర్ర రోహిత్ కుమార్, ఎంఈఓగా బొల్లెం కార్తీక్, చైర్మన్ గా ఎర్ర శ్రేయాన్షి, ప్రధానోపాధ్యాయులు గా వస్కుల శ్యామ్ దీక్షిత్ భాద్యతలు నిర్వహించారు. ఈ కార్యమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బోయ రాములు మాట్లాడుతూ... విద్యార్థులు అందరు మంచిగా చదువుకొని భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సంపాదించి తల్లి తండ్రులకు,సమాజానికి సేవ చేయాలని తెలిపారు.అలాగే ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ ఎర్ర పారిజాత్ ప్రధానోపాధ్యాయులు బోయ రాములు,ఉపాధ్యాయురాలు బి.మంజుల బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ ఏర్పుల  సావిత్రిమ్మ,ఎర్ర రమణ, విద్యార్థుల తల్లి తండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags: