భక్తి శ్రద్ధలతో ఘనంగా తొలి ఏకాదశి

భక్తి శ్రద్ధలతో ఘనంగా తొలి ఏకాదశి

విశ్వంభర, ఇనుగుర్తి: శ్రీమహావిష్ణువు అత్యంత ప్రీతికరమైన తొలి ఏకాదశి హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైన ఏకాదశిలలో ఒకటి కావడంతో శనివారం నెల్లికుదురు ఇనుగుర్తి మండల కేంద్రాలతో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. నెల్లికుదురు లోని శ్రీ గోదా రంగనాయక స్వామి ఆలయాన్ని భక్తులు సందర్శించుకోవడంతో రద్దీగా మారింది. నెల్లికుదురు శ్రీ గోదా రంగనాయక స్వామి, ఇనుగుర్తి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై మూలవిరాట్ కు అభిషేకాలు,అర్చనలు,పూజలు చేశారు.చాలామంది భక్తులు ఇతర పవిత్ర విష్ణు ఆలయాలకు రామాలయాలకు తరలి వెళ్లారు.తొలి ఏకాదశి రోజు భక్తులు విష్ణు సహస్రనామం శ్రీమద్భగవద్గీత విష్ణు అష్టోత్తర శతనామావళి, ఓం నమో నారాయణ మంత్రం వంటివి పారాయణం చేశారు. విష్ణు కథలను చదివి భజనలు చేశారు. ఉపవాస దీక్షలు పాటించారు.

🕒 26 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-first-ekadashi-is-celebrated-with-devotion/article-19750

Tags: