రోడ్డుకు అడ్డంగా మట్టి - ప్రశ్నించిన వారిపై అసభ్య పదజాలం
విశ్వంభర, బడంగ్ పేట్ :- మున్సిపల్ పరిధిలోని తిరుమల నగర్, రోడ్ నెం.2లో కొందరు వ్యక్తులు రోడ్డుకు అడ్డంగా సుమారు రెండు అడుగుల ఎత్తులో మట్టిని పోయించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 20 ఫీట్ల రోడ్డులో మట్టి పూసి రాకపోకలకు ఇబ్బందిగా , కాలనీలోని ఎత్తైన ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీరు ఈ మట్టి కుప్పల వద్ద నిలిచిపోతుండటంతో దుర్గంధం వెదజల్లడమే కాకుండా దోమలు పెరిగి ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్కూల్‌కు వెళ్లే చిన్నారులు, వృద్ధులు, వాహనదారులు ఈ నీటిని దాటేందుకు ఇబ్బందులు పడుతూ ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొన్నట్లు తెలిపారు.ఇదే విషయం గురించి స్థానికంగా ఉంటున్న వీత్రీ న్యూస్ ఛానల్ వీడియో జర్నలిస్ట్ గజవెళ్లి గురుమూర్తి ప్రశ్నించగా సంబంధిత వ్యక్తిని ప్రశ్నించగా, "నేనింతే... నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను" అంటూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఈ ఘటనపై సంబంధిత అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి, రోడ్డుపై వేసిన మట్టిని వెంటనే తొలగించి వర్షపు నీటి పారుదలకు ఏర్పాట్లు చేయాలని, అలాగే జర్నలిస్టుపై దురుసుగా ప్రవర్తించిన ఘటనపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.