వేసవికాల కార్యాచరణ విద్యుత్ పనులకు సన్నద్ధం – సీఎండీ సూచనలు

వేసవికాల కార్యాచరణ విద్యుత్ పనులకు సన్నద్ధం – సీఎండీ సూచనలు

  • వ్యవసాయ సర్వీసుల మంజూరు వేగవంతం
  • రియల్ టైం ఫీడర్ పనులను  పూర్తి చేయాలి

విశ్వంభర, హనుమకొండ :-విద్యుత్ సబ్‌స్టేషన్ల రియల్ టైమ్ ఫీడర్ మానిటరింగ్ పనులను పెండింగ్ లేకుండా అత్యంత వేగంగా పూర్తి చేయాలని టిజి-ఎన్పీడీసీఎల్ సీఎండీ శ్రీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. హన్మకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్ కార్పొరేట్ కార్యాలయం నుండి 17 సర్కిళ్ల ఎస్ఈలు, డి.ఈ లు మరియు ఎస్ఏవోలతో ఆయన సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ జనవరి 15లోపు హెచ్‌టీసర్వీసులకు ఆటోమెటిక్ మీటర్ రీడింగ్ (AMR) ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఇకపై కొత్తగా విడుదల చేసే సర్వీసులు కూడా AMR ద్వారా పర్యవేక్షణలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.ప్రతి డివిజన్లో హై-లాస్ ఫీడర్లను గుర్తించి, వాటిపై క్షుణంగా  పరిశీలన చేసి పెట్రోలింగ్ నిర్వహించినష్టాలకు కారణాలను విశ్లేషించి తగ్గించాలని తెలిపారు. వచ్చే వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకుని పట్టణాల్లో లోడ్ పెరుగుదల అంచనాల మేరకు ఇప్పటి నుంచే సామర్థ్యం పెంపు, అప్‌గ్రేడేషన్ పనులు మొదలుపెట్టాలని సూచించారు. ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సామర్థ్యాన్ని పెంచి ఫెయిల్యూర్లను తగ్గించాలని, లోడ్ భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న 33కేవీ ఇంటర్‌లింకింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని చెప్పారు . బంచింగ్ ఫీడర్లను వేరు చేసి లైన్ సిస్టమ్స్ చక్కదిద్దాలని అన్నారు .  సాధ్యమైనంతవరకు లైన్ క్లియరెన్స్ (LC) తగ్గించాలని సూచించారు.వచ్చే నెలలో లక్ష్యానికి అనుగుణంగా వ్యవసాయ సర్వీసులు మంజూరు జరిగేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి రెండు నెలల్లో వ్యవసాయ సర్వీసులు మరింతగా పెరిగేలా చూడాలని తెలిపారు. HT సింగిల్ విండో సెల్‌లో సర్వీసుల మంజూరును వేగవంతం చేసి, టిజి ఐపాస్ మరియు నాన్ టిజి ఐపాస్ దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలని సూచించారు.100 శాతం రెవెన్యూ వసూళ్లు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నాన్ IRDA మీటర్లు ఉన్న చోట్ల IRDA మీటర్లు అమర్చాలని, OCR ద్వారా  బిల్లింగ్  100% పూర్తి చేయాలని ఆదేశించారు.

  • బ్రాడ్ బ్యాండ్, కేబుల్ ఆపరేటర్లతో సమీక్షలు చేసి అనవసర కేబుళ్లను తొలగించాలని , జిఐఎస్ మ్యాపింగ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు . 
     వర్క్ ఆర్డర్లు పెండింగ్ లేకుండా సమయానికి పూర్తి చేయాలన్నారు
  • •కామన్,  మల్టిపుల్ రాంగ్ క్యాటగిరీ సర్వీసులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు .

ఈ సమావేశంలో డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ఈ లు టి.సదర్ లాల్, కె.రాజు చౌహన్, అశోక్, వెంకటరమణ, అన్నపూర్ణ, సురేందర్, సీజీఎంలు చరణ్ దాస్, కిషన్, జీఎంలు:  వేణు బాబు, కృష్ణమోహన్, వెంకటకృష్ణ, శ్రీనివాస్, వాసుదేవ్, నాగ ప్రసాద్, శ్రీకాంత్, సామ్య నాయక్, కళాధర్ తదితరులు పాల్గొన్నారు.

Read More అఖండ-2 అఖండమైన విజయం సాధిస్తుంది

Tags: