వార్డు సభ్యురాలికి సన్మానం
On
విశ్వంభర,ఇనుగుర్తి: మానుకోట జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామానికి చెందిన వార్డు సభ్యురాలు మునిగంటి సరితను తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ రాష్ట్ర సంఘం హైదరాబాదులో ఆదివారం ఘనంగా సన్మానించింది.రాష్ట్రంలోని స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధుల సన్మానం లో భాగంగా సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేములవాడ మదనమోహన్,చొల్లేటి కృష్ణమాచారి లతో కలిసి మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి చేతుల మీదుగా సరితకు శాలువా కప్పి మెమొంటో అందజేసి గౌరవించారు. ఈ కార్యక్రమంలో సరిత భర్త విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా నేత మునిగంటి రాజు చారి తదితరులు పాల్గొన్నారు.



