రానున్నది బిఆర్ఎస్ ప్రభుత్వమే
- సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
విశ్వంభర, సంగారెడ్డి : బిఆర్ఎస్ పార్టీతోనే పట్టణాల అభివృద్ధి సాధ్యమని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని 20, 21 వార్డులలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ రజక సంఘం అధ్యక్షులు శివరాజ్ బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పార్టీ కండువా కప్పి వారికి ఘనంగా స్వాగతం పలికారు. అలవికాని హామీలతో ప్రజలను మభ్యపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమి లేదని విమర్శించారు. మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయా వార్డుల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



