చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
On
విశ్వంభర,కడ్తాల్: మండల కేంద్రంలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 29 నుండి 3 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ అభివృద్ధి చైర్మన్ పాలాది ఆంజనేయులు స్థానిక మాజీ సర్పంచ్ లక్ష్మీ నర్సింహ్మ రెడ్డితో కలిసి పలువురికి ఆహ్వాన పత్రికలు అందజేశారు.ఆదివారం కడ్తాల్ మండల కేంద్రంలో మాజీ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ కు ఆహ్వాన పత్రిక అందజేశారు.వారం రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఉత్సవాలను జయప్రదము చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కడ్తాల్ మండల మాజీ రైతు అధ్యక్షుడు జోగు వీరయ్య, మాజీ వార్డు సభ్యులు మూడ అశోక్, నాయకులు పర్వత కుమార్ యాదవ్, క్యామ సత్యం తదితరులు పాల్గొన్నారు.



