అభివృద్ధి విషయంలో రాజీపడం
- పేద ప్రజల కోసమే మా తపన
- 14వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ఉల్లిగడ్డల ఛాయా శాంత్ కుమార్
విశ్వంభర, సదాశివపేట: 14వ వార్డు అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీపడమని బీఆర్ఎస్ అభ్యర్థి ఉల్లిగడ్డల ఛాయా శాంతు కుమార్ అన్నారు. వార్డులో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తనను గతంలో ఆశీర్వదించి కౌన్సిలర్ గా గెలిపించారని ఈమారు ఎన్నికల్లో గెలిపిస్తే ఐదేళ్లు కళ్ళముందే ఉండి 24 గంటలు సేవలందిస్తానని అన్నారు. గతంలో తాను కౌన్సిలర్ గా ఉన్న సమయంలో వార్డులో గల్లి గల్లి లో శాశ్వత మంచినీటి ట్యాంకులు నిర్మించామని అర్హులకు పింఛన్లు అందించామని తాగునీరు, పారిశుద్ధ్యం వీధి దీపాలు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించి వార్డును తీర్చిదిద్దామని ఆమె గుర్తు చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడబోమని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని, గల్లీల్లో కొత్త సిసి రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాల్లో డబ్బు కాదు ప్రజాసేవను గుర్తించి ఓటు వేయాలని అన్నారు. 14వ వార్డును ఆదర్శ అవార్డుగా ప్రజల ముందు పెడతానని చెప్పారు. మహిళల కోసం తనకు ప్రత్యేక కార్యచరణ ఉందన్నారు. నిరుద్యోగ యువతీ యువకుల కోసం తాను నిరంతరం శ్రమిస్తానని వారికి అవసరమైన చోట ఉపాధి కల్పిస్తామన్నారు. వార్డులో ఆడబిడ్డల పెళ్లిళ్లకు సాయం అందించి ఆసుపత్రిలో ఉన్న పేదల కు అండగా ఉంటామన్నారు. వార్డులో ఛాయా శాంతి కుమార్ నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తున్నది. ఈ కార్యక్రమంలో పెద్ద నరసింహ గౌడ్, ఉల్లిగడ్డ శాంతు కుమార్, చందు గౌడ్, చిన్న నరసింహ గౌడ్ గణేష్ కృష్ణ గౌడ్, విల్లాస్, మోహన్ సాగర్, జనార్ధన్, కూర పవన్, మల్లికార్జున్ భారీ ఎత్తున బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.



