94 ఇళ్లు గడచినా లెక్క తప్పని టవర్
On
విశ్వంభర, నిర్మల్: నిర్మల్ జిల్లా సోన్ వద్ద గోదావరిపై 1932లో నిర్మించిన వంతెనకు అనుబంధంగా ఏర్పాటు చేసిన నీటి ప్రవాహాన్ని కొలిచే గేజ్ స్టేషన్ టవర్ లోనే శ్రీరామసాగర్ జలాశయం నిర్మించక ముందు నదీ ప్రవాహం లెక్కలనునమోదు చేసేవారు. నీటి వాహాన్ని నిరంతరం పరిశీలిస్తూ వరదలపై అంచనాలు, పర్యవేక్షణ, హెచ్చరికల జారీకి ఇది కీలకంగా ఉండేదని నీటిపారుదల శాఖ నిర్మల్ ఈఈ అనిల్ తెలిపారు. దీనికున్న రంధ్రాల ద్వారా నది నీరు లోపలికి ప్రవేశిస్తుంది. అక్కడ నీటి మట్టాన్ని నమోదు చేసేవారు. వంతెనపై నుంచి ఈ టవర్ లోపలికి వెళ్లేందుకు అప్పట్లో పెట్టిన గేటు, నిచ్చెన, పైన వేసిన రేకుల కప్పు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. 94 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.9.50 లక్షల ఖర్చు కావడం గమనార్హం.



