కాంగ్రెస్ పార్టీ గెలుపు.. వార్డుల అభివృద్ధికి మలుపు

కాంగ్రెస్ పార్టీ గెలుపు.. వార్డుల అభివృద్ధికి మలుపు

  • 6 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి చిలుముల సునీల్ రెడ్డి

 విశ్వంభర,సూర్యాపేట: కాంగ్రెస్ పార్టీ గెలుపు వార్డుల అభివృద్ధికి మలుపు అని 6 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి చిలుముల సునీల్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రం 6 వ వార్డులో గడప గడపకు ప్రచార కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. గడప గడపకు తిరుగుతూ ఓటర్లను కలిసి చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అభివృద్దే ధ్యేయంగా ప్రజా సేవే లక్ష్యంగా మీ ముందుకు వస్తున్న తనను ఆశీర్వదించాలని చిలుముల సునీల్ రెడ్డి ఓటర్లను కోరారు.కౌన్సిలర్ గా గెలిపిస్తే మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, తెలంగాణ రాష్ట్ర పర్యటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి,  సహకారంతో అధిక నిధులు తీసుకువచ్చి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. 6 వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈనెల 11న జరగనున్న ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను చిలుమల సునీల్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నాగిరెడ్డి,  సందీప్ రెడ్డి, చిలుముల సైదిరెడ్డి , కట్కూరి శేఖర్ రెడ్డి,  కట్కూరి వెంకట్ రెడ్డి,  మంగళపల్లి వీరారెడ్డి , వెంకటేశ్వర్లు,  శంకరాచారి,  తదితరులు పాల్గొన్నారు. 

Tags: