ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి
- జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
విశ్వంభర, మహబూబాబాద్: సోమవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.అనిల్ కుమార్ అన్ని విభాగాల జిల్లా అధికారులు, తొర్రూరు, మహబూబాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారులు గణేష్, క్రిష్ణవేణి లతో అదేవిధంగా మండల అధికారులతో గూగుల్ మీట్ ద్వారా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం వచ్చిన దరఖాస్తుదారులతో కలెక్టర్ స్వయంగా ఫిర్యాదులు తీసుకొని వారి వినతులను సవివరంగా విని సంబంధిత విభాగాల అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పెండింగ్ ఫైళ్లను, ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి తక్షణమే క్లియర్ చేయాలని, కార్యాలయాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలకు జవాబుదారీ తనంగా ఉంటూ సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన వసతి గృహాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పిల్లలతో కలిసి బ్రేక్ ఫాస్ట్ ,భోజనం, డిన్నర్ చేయాలని, ఏమైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం కు చెందిన గుండ్ల ఉపేందర్ తాను ఎన్నో ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూమి వేరొకరి పేరు మీద పట్టా మార్పు జరిగిందని అట్టి భూమి తిరిగి తన పేరు మేరు మీద మార్పు చేసి పట్టా పాసు పుస్తకము ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. గంగారం మండలం దుబ్బగూడెం గ్రామానికి చెందిన గ్రామస్తులు స్తానికంగా ఉన్న ఫర్టీలైజర్ దుకాణ యజమానులు ఎరువులను ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని, అదేవిధంగా తమ గ్రామానికి కేటాయించిన మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని వేరే గ్రామానికి తరలించారని తమపై అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్నారని, మొక్క జొన్న తక్కువ ధరకు కొనుగోలు చేసి చెల్లిస్తున్నారని అట్టి ఫర్తీలైజర్ యజమానులపై చట్ట రిత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. గార్ల మండలం బాలాజీ తండ కు చెందిన సరోజ తనకు గతంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చినట్లు రికార్డులో చూపిస్తుందని కానీ ఇప్పటివరకు తనకు ఇందిరమ్మ ఇల్లు సాంక్షన్ కాలేదని రికార్డులను పరిశీలించి తనకు ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా న్యాయం చేయాలని కోరారు. సీరోలు మండలం సీత్లా తండ గ్రామ పంచాయతీ అందనాల వీడు కు చెందిన అంగోతు లచ్చు తనకున్న 2.20 ఎకరాలకు 2024 సంవత్సరము నుండి ఇప్పటివరకు తన ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ అవట్లేవని పరిశీలించి తనకు రైతు భరోసా డబ్బులు ఇప్పించగలరని కోరారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి లో వచ్చిన 168 దరఖాస్తులను సంబందిత శాఖల అధికారులకు సత్వర పరిష్కారానికి ఆదేశించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, జడ్పీ సీఈవో పురుషోత్తం, అన్ని విభాగాల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్