ఘనంగా ఎడిసి పల్లె కృష్ణమూర్తి ఉద్యోగ విరమణ సన్మానం . -అభినందనలు తెలిపిన గద్దె విజయ్ నేత

ఘనంగా ఎడిసి పల్లె కృష్ణమూర్తి ఉద్యోగ విరమణ సన్మానం . -అభినందనలు తెలిపిన గద్దె విజయ్ నేత

విశ్వంభర, సంగారెడ్డి:-  టిఎస్ ఆర్టీసీ సంగారెడ్డి  డిపోలో విశిష్ట సేవలందించిన ఎడిసి పల్లె కృష్ణమూర్తి ఉద్యోగ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో తోటి ఉద్యోగులు , సన్నిహితులు , బంధువులు , మిత్రులు కలిసి సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సన్మాన  వేడుకలలో స్థానిక రంగారెడ్డి ఆర్టీసీ డిపో ఆర్ ఎం , డిపో మేనేజర్ , ఎఫ్ ఎం , సహచర ఉద్యోగులు , శ్రేయోభిలాషులు పల్లె కృష్ణమూర్తి సతీమణి సువర్ణ దంపతులను ఘనంగా శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ప్రముఖ సామాజికవేత్త , మల్కాజ్ గిరి టీడీపీ అడ్ హాక్ కమిటీ సభ్యులు , బిఎన్ రెడ్డి నగర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ గద్దె విజయ్ నేత పాల్గొని  పల్లె కృష్ణమూర్తి సువర్ణ దంపతులను శాలువా , భారీ గజమాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా గద్దె విజయ్ నేత మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ఉద్యోగానికి ఎనలేని సేవలు చేసి , ఉద్యోగం చేసిన ప్రతి చోట మంచి పేరు సంపాదించుకొని నేడు ఉద్యోగ విరమణ చేస్తున్న పల్లె కృష్ణమూర్తి కి విశ్రాంత జీవితం సుఖ సంతోషాలతో , కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని వారు అన్నారు.  ఈ కార్యక్రమంలో గోపాల్ , గుండు చంద్రమౌళి , జై శ్రీ ,గుండు అంజనేయులు, యాదగిరి, మరియు అర్జున్ బంధుమిత్రులు పాల్గొన్నారు. 

Tags: