రైతులు ధాన్యం ఆరబెట్టుకోవడానికి భూములు కేటాయించాలి

రైతులు ధాన్యం ఆరబెట్టుకోవడానికి భూములు కేటాయించాలి

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని చాలా గ్రామాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి, కానీ ఇతరుల కబ్జాలో ఉన్నాయి. గ్రామాల్లోని రైతులు తాము పండించిన పంటను కోసి ఆరబెట్టుకోవడానికి స్థలాలు లేక ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.2,360/- ఉన్నప్పటికీ, అకాల వర్షాలకు భయపడి అతి తక్కువ ధరలకు దళారులకు క్వింటాలుకు రూ.1,700/-, 1,800/-లకే అమ్ముకోవాల్సిన పరిస్థితి. యాసంగి (రబీ) సీజను వరిచేలు కోతకు సిద్ధం అయ్యాయి, అనుకోకుండా అకాల వర్షాలకు వరిపంటలు అడ్డంపడి నేలపాలు అవుతున్నాయి, ఇప్పటి పరిస్థితులు చూడలేక వరిపంట కోసి దళారులకు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. పంటలు కోతకు సిద్ధం అయ్యే సమయానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయకపోవడం శోచనీయం అని రైతులు వాపోతున్నారు. ఈ విషయమై అప్పటి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కూడా సానుకూలంగా స్పందించి, ఈ దిశగా ప్రయత్నం చేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ప్రతి ఊర్లో ఉన్న ప్రభుత్వ భూములను రైతులకు వారి ధాన్యం ఆరబెట్టుకోవడానికి ఎప్పటికీ ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని, మండల తహసిల్దార్, ఇతర సంబంధిత అధికారులకు ప్రభుత్వ భూములను వెలికి తీసేలా ఆదేశాలిచ్చి, శ్రద్ధ చూపాలని, ఏదో ఒక శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచన చేయాలని, ఇది రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని రైతులు కోరుతున్నారు. కొన్ని గ్రామాల్లోని ప్రజలు ఎక్కడ తమ భూములకు వడ్లు ఆరబెట్టుకోవడానికి రైతులకు ఇస్తే తమ భూములు సాగు చేస్తలేరని ఎక్కడ రైతుబంధు లాంటివి ఇవ్వకపోవడం వల్ల రైతులకు వారి ధాన్యం ఆరబెట్టుకోవడానికి తమ భూములు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. గతంలో ఇలా రైతులకు తమ భూములు ఇచ్చిన వాళ్ళకు రైతుబంధు ఇవ్వకపోవడం వల్ల ప్రజలు ధాన్యం ఆరబెట్టుకోవడానికి రైతులకు తమ భూములు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఆ రైతుబంధు పైసలు తాము ఇస్తామని రైతులు అన్నా కూడా గ్రామప్రజలు ఇవ్వడం లేదు. ముందుగా ప్రతీ గ్రామంలో ఎంత ప్రభుత్వ భూములు ఉన్నాయో లెక్క తీసి, వాటిని ధాన్యం ఆరబెట్టుకోవడానికి రైతులకు ఉపయోగపడేలా ఏర్పాట్లు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, రైతులు కోరుతున్నారు

Tags: