సాంస్కృతిక ప్రదర్శనలతో మెరిసిన గ్రాడ్యుయేషన్ డే
విశ్వంభర, షాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగర్ గూడ శ్రీ చైతన్య హైస్కూల్లో సోమవారం గ్రాడ్యుయేషన్ డే ఉత్సాహంగా నిర్వహించారు. ఈ వేడుకలు విద్యార్థుల ప్రతిభకు వేదికగా నిలిచాయి. కరస్పాండెంట్ ప్రసాద్ సిద్దాపురం, శిరీష ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాటలు, నృత్యాలు, వివిధ ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. పెద్ద సంఖ్యలో హాజరైన తల్లిదండ్రులు విద్యార్థుల ప్రతిభను చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, కృషి, పట్టుదలతో చదివితేనే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని తెలిపారు. ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ముందంజలో ఉన్నాయని చెప్పారు. గత 18 సంవత్సరాలుగా నిరంతర కృషితో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీరాములు, డైరెక్టర్ సుశాంత్, ఇన్‌చార్జ్ రాజనరేందర్, మధు, అజయ్, సఫియా, అపర్ణ, సునంద, మాధవి, ప్రభావతి, అనురాధ, ప్రవీణ్, పావని, శిల్పా, నేహా, కీర్తన, సంతోష, అరుణ, సునీత, శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.



