నేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సదస్సు
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్థశాస్త్రం, వాణిజ్యశాస్త్రం, భౌతికశాస్త్రం విభాగాల ఆధ్వర్యంలో "ఉన్నత విద్యలో అభివృద్ధి చెందుతున్న ఆవిష్కరణలు మరియు సమకాలీన పురోగతి" అను అంశం పైన రేపు జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం తెలియజేశారు. ఈ సదస్సు ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షులు ఆచార్య ఇటిక్యాల పురుషోత్తం, కీలకోపన్యాసకులుగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అధ్యాపకులు డాక్టర్ సిహెచ్.కృష్ణారెడ్డి, గౌరవ అతిథిగా స్థానిక సర్పంచ్ గరికపాటి సత్యనారాయణ హాజరు అవుతారని అన్నారు. అదే విధంగా ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, ప్రముఖకవి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి , గౌరవ అతిథులుగా కేరళ కేంద్రీయ విశ్వవిద్యాలయం అధ్యాపకులు డాక్టర్ బండారు రామకృష్ణ, జేఎన్టీయూ అధ్యాపకులు డాక్టర్ సురేష్ శ్రీపాద, చేవెళ్ల డిగ్రీ కళాశాల అధ్యాపకులు ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ఏ మాలిక్ తదితరులు వస్తున్నారని తెలియజేశారు. అంతే కాకుండా ఈ సదస్సులో ఆయా విశ్వవిద్యాలయాల, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు సుమారు 40 మంది పాల్గొని పత్ర సమర్పణ చేస్తారని తెలియజేశారు. సదస్సు నిర్వాహకులు డాక్టర్ పి.వెంకటేశ్వరరావు, డాక్టర్ జె.చిన్నబాబు, డాక్టర్ జి.సునీత మాట్లాడుతూ, ఒకరోజు జరిగే ఈ జాతీయ సదస్సులో పరిసర ప్రాంతాలలోని ఆయా కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.



