హాషిష్ ఆయిల్‌ తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

హాషిష్ ఆయిల్‌ తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా (హాషిష్ ఆయిల్‌)  గంజాయి నుండి తయారు చేసే మత్తు పదార్థం  ను తరలిస్తున్న వ్యక్తిని మహేశ్వరం  పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో సోమవారం  విలేకరుల సమావేశంలో  డిసిపి నారాయణరెడ్డి మాట్లాడుతూ, ఈనెల  29వ తేదీ సాయంత్రం ఎస్ హెచ్ ఓ కు అందిన  సమాచారంతో ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్‌ కు మహేశ్వరం గేట్ మార్గంగా హాషిష్ ఆయిల్‌ను తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ సమాచారం మేరకు ఎస్ హెచ్ ఓ  ఆదేశాలపై మహేశ్వరం సబ్ ఇన్‌స్పెక్టర్, పోలీసు సిబ్బంది  క్లూస్ టీమ్ కలిసి మహేశ్వరం గేట్ వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. కొరాబు చంటి బాబు (35) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామ రాజు జిల్లా, జీడిమడుగుల మండలం, సంకుల మిడ్డె గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. అతని వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా సుమారు 9.402 కిలోల హాషిష్ ఆయిల్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో  మహేశ్వరం సిఐ  రాఘవేందర్ రెడ్డి, ఎస్సై ప్రసాద్, కానిస్టేబుల్ పోలీస్ సిబ్బంది  పాల్గొన్నారు.

Tags: