ఈవీ వాహనాలకు ప్రోత్సాహం
On
విశ్వంభర, హైదరాబాదు : ఈవీ వాహనాలకు ప్రోత్సాహంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ మినిస్టర్ క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి ఎలక్ట్రిక్ కారులో ప్రయాణించారు. ప్రభుత్వం ఈవీ పాలసీ ద్వారా 100 శాతం రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ మినహాయింపులు కల్పిస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీలు ప్రకటించిన టాటా మోటార్స్‌ను అభినందించారు. మహీంద్ర ఎలక్ట్రిక్, గ్రావిటన్ మోటార్స్, ఓలా ఎలక్ట్రిక్, ఆథర్ ఎనర్జీ వంటి సంస్థలు ఇప్పటికే ముందుకు వచ్చాయని, మరిన్ని సంస్థలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.



