సురేందర్ రెడ్డికి  సన్మానం 

సురేందర్ రెడ్డికి  సన్మానం 

విశ్వంభర, బాగ్ లింగంపల్లి : తెలంగాణ హైకోర్ట్ అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎస్. సురేందర్ రెడ్డికి  వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ ఆధ్వర్యంలో బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్క్‌లో ఘనంగా సన్మానించారు.  నాయకత్వం, సేవా భావం, న్యాయవాద రంగంలో సాధించిన ప్రతిష్టను కొనియాడారు. వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్  అధ్యక్ష కార్యదర్శులు ఎస్. మనోహర్ రెడ్డి , ఎం. దశరథ్,, కోశాధికారి కళ్యాణ్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కె. రామానందం, వి. నాగభూషణం, కందూరి కృష్ణ, దామోదర్ రెడ్డి, సంపత్ రెడ్డి, మాధవరావు, రాజేంద్రప్రసాద్ గౌడ్, రాజేశ్వర్ రావు, శంకర్ రావు, ఎస్. రమేష్ రెడ్డి, ఆర్. వివేక్ ఆనంద్, పి.వి. నిరంజన్ రెడ్డి, శైలజ మోహన్, క్లబ్ సభ్యులు, వాకర్స్, ప్రముఖులు  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Tags: