విత్తన బంతులపై విద్యార్థులకు శిక్షణ

విత్తన బంతులపై విద్యార్థులకు శిక్షణ

విశ్వంభర, నెల్లికుదురు: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ సామాజిక శాస్త్ర ఉపాధ్యాయురాలు అంజుమ్ సుల్తానా 6వ తరగతి బాల బాలికలకు విత్తన బంతుల తయారీపై సోమవారం శిక్షణ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా సెంటర్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ శిక్షణల ఆధారంగా ప్రిన్సిపాల్ జి.ఉపేందర్ రావు, తోటి ఉపాధ్యాయుల సహకారంతో స్టూడెంట్స్ కు ట్రైనింగ్ ఇచ్చారు. మట్టి, ఎరువు, విత్తన మిశ్రమాలతో సీడ్ బాల్స్ ను(విత్తన బంతులు ) తయారు చేసినట్లు సామాజిక శాస్త్ర టీచర్ అంజుమ్ సుల్తానా తెలిపారు. ఈ  విత్తనాలను పక్షులు, ఎలుకల బారి నుండి రక్షించి తేమను అందించి పూర్తిస్థాయిలో మొలకెత్తడానికి అనువుగా ఉంటాయన్నారు. ఖాళీ ప్రదేశాలు, బీడు భూములు, అటవీ ప్రాంతాలు , రోడ్ల పక్కన వీటిని చల్లడంతో వర్షాలు పడగానే సులభంగా మొలకెత్తి చెట్లు గా పెరుగుతాయన్నారు. ఈ పద్ధతి పూర్వం ఎక్కువగా ఉండేదని ఇది సులభమైన ప్రభావవంతమైన మార్గమన్నారు.

Tags: