ఇందిరా పార్కులో కబ్జాలకు చెక్
On
విశ్వంభర, ముషీరాబాదు : ఇందిరా పార్కులో కబ్జా యత్నాలను హైడ్రా అడ్డుకుంది. పాత స్కేటింగ్ రింగ్ స్థలంలో అనుమతులు లేకుండా జరుగుతున్న నిర్మాణాలను నిలిపివేసింది. సోమవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్థలాన్ని పరిశీలించి ప్రహరీ పునరుద్ధరణకు ఆదేశించారు. కొత్త స్కేటింగ్ రింగ్ ఉన్న నేపథ్యంలో పాత స్థలాన్ని పార్కులో కలపాలని సూచించారు. ప్రహరీ కూల్చివేతపై కాంట్రాక్టర్‌పై దోమలగూడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.



