ఆశా వర్కర్లకు రూ.18,000 వేతనం చెల్లించాలి 

ఆశా వర్కర్లకు రూ.18,000 వేతనం చెల్లించాలి 

  •  సిఐటియు డిమాండ్ 

విశ్వంభర, మహబూబాబాద్ :  రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా  ఆశా వర్కర్లు మహబూబాద్ మండలం  కంబాలపెల్లి గ్రామంలోని   ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు  నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భంగా కార్యక్రమానాని ఉద్దేశించి  సిఐటియు  జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి కుంట్ల  నాగన్న  మాట్లాడుతూ, ఎన్నికల  మేనిఫెస్టోలో ఆశ వర్కర్లకు కనీస వేతనం 18 వేల రూపాయలు ఇస్తామని  హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అనంతరం ఇచ్చిన హామీని  అమలు చేయకుండా రెండున్నర సంవత్సరాల నుండి కాలయాపన చేస్తుంది అన్నారు.  ప్రతినెల ఒకటవ తారీఖు నాడు  వేతనం ఇవ్వాలని, పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని, పని భారం తగ్గించాలని, సమాన పనికి ,సమాన వేతనం, ఇవ్వాలని వ్యక్తిగత బీమా సౌకర్యం, అర్హులైన ఆశాలను  ఏఎన్ఎంలుగా  గుర్తించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని  మట్టి ఖర్చుల కింద లక్ష రూపాయలు ఇవ్వాలని ఆశలను ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలని, ఈఎస్ఐపీఎఫ్ ,  సౌకర్యం కల్పించాలని, ఎవరైనా  ప్రమాదంలో చనిపోతే వారి కుటుంబ లో  ఒక్కరికి  తప్పకుండా ఉద్యోగం ఇవ్వాలని , గత 15 రోజుల నుండి ఆశ వర్కర్లు  నిర్వహిస్తున్నారని  అన్నారు . తక్షణమే ఆశలకు  త్వరగా తీపి కబురు చెప్పాలని ఆయన కోరారు .  ఈ కార్యక్రమంలో కరుణ ,  సునీత  ,రజిని , సరిత సుకన్య ,సావిత్రి ,రమ్య , విజయ ,సులోచన , సైదమ్మ  ,పద్మ ,సరస్వతి ,యాకమ్మ ,యాక , లక్ష్మి ,సునీత , తదితరులు పాల్గొన్నారు .

Tags: