మహిళలకు రూ.2500 హామీ ఏమైంది

విశ్వంభర, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రూ.2500 అందజేస్తామన్న ఆర్థికసాయం ఏమైందని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి యాదగిరి ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ,  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినా రూ.2500 ఊసే లేదని విమర్శించారు. మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అబద్దపు హామీలతో రేవంత్ సర్కార్ గద్దెనెక్కిందని, హామీలు అమలు చేయకపోతే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పుల్లూరు ఉమేశ్, నియోజకవర్గ అధ్యక్షుడు కొండపలకల సంపత్, ఈసీ మెంబర్ రోమాల బాబు, పట్టణ అధ్యక్షుడు గోపాల ప్రసాద్, ప్రసాద్ మౌర్య, స్థానిక  నాయకులు పాల్గొన్నారు.

Tags: