లేబర్ కోడ్ ప్రతులు దగ్ధం
విశ్వంభర, చిక్కడపల్లి : కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టియుసిఐ నాయకులు హైదరాబాదు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎల్. పద్మ మాట్లాడుతూ, ఈ కోడ్‌లు కార్మిక హక్కులను హరించే చట్టాలని, వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక యజమానులకు అనుకూలంగా ఉన్న ఈ చట్టాలు కార్మికులకు నష్టం చేస్తాయని అన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. హన్మేష్ మాట్లాడుతూ, రైతులకు తీసుకొచ్చిన చట్టాల మాదిరిగానే ఇవి కూడా కార్మికులకు నష్టమని విమర్శించారు. తెలంగాణలో ఈ కోడ్‌ల అమలు నిలిపివేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్. నల్లన్న, లక్ష్మీ, సత్యనారాయణ, టి. నారాయణ, మెహర్, కిరణ్, నాగయ్య, సుధాకర్, ఎం. రవికుమార్, బి.ఎస్. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.



