ఎమ్మెల్యే ఆడియోపై విచారణ జరిపించాలి : సీపీఎం
విశ్వంభర, హైదరాబాదు : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బిల్డింగ్ పర్మిషన్ కోసం రూ.2 కోట్ల లంచం అడిగినట్లు మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం నగర కార్యదర్శి ఎం. వెంకటేష్ డిమాండ్ చేశారు. దోషులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆడియోలో ఎమ్మెల్యేకు ఇప్పటికే రూ.25 లక్షలు అందినట్లు వినిపిస్తోందని తెలిపారు. ఇందులో కొంతమంది ప్రభుత్వ అధికారులకు కూడా డబ్బులు ఇచ్చినట్లు ప్రస్తావన ఉన్న నేపథ్యంలో, ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత ఉందో బయట పెట్టాలని కోరారు. ప్రజాప్రతినిధిగా ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడటం గర్హనీయమని విమర్శించారు. ఎమ్మెల్యే పదవికి దానం నాగేందర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.విశ్వంభర, హైదరాబాదు : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బిల్డింగ్ పర్మిషన్ కోసం రూ.2 కోట్ల లంచం అడిగినట్లు మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం నగర కార్యదర్శి ఎం. వెంకటేష్ డిమాండ్ చేశారు. దోషులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆడియోలో ఎమ్మెల్యేకు ఇప్పటికే రూ.25 లక్షలు అందినట్లు వినిపిస్తోందని తెలిపారు. ఇందులో కొంతమంది ప్రభుత్వ అధికారులకు కూడా డబ్బులు ఇచ్చినట్లు ప్రస్తావన ఉన్న నేపథ్యంలో, ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత ఉందో బయట పెట్టాలని కోరారు. ప్రజాప్రతినిధిగా ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడటం గర్హనీయమని విమర్శించారు. ఎమ్మెల్యే పదవికి దానం నాగేందర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.



