సర్పంచులకు సన్మానం

సర్పంచులకు సన్మానం


విశ్వంభర, రామన్నపేట: ఉమ్మడి నల్గొండ జిల్లాలో రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో  కొత్తగా ఎన్నికైన సర్పంచులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని పల్లివాడ గ్రామ సర్పంచ్ ఖమ్మంపాటి శ్రీనివాస్, వెల్లంకి గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్, సర్నేనిగూడెం గ్రామ సర్పంచ్ గంగదేవి స్వామి లకు సన్మానం చేయడం జరిగింది. రామన్నపేట నియోజకవర్గాన్ని సాధించుకుందామని సర్పంచ్ లతో జరిగిన చర్చలో వారు సానుకూలంగా స్పందించి ఎలాగైనా రామన్నపేటని నియోజకవర్గంగా చూడాలని తమకు ఉందని, తాము కూడా అందులో భాగస్వాములమై సహకరిస్తామని చెప్పారని రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర రమేష్ గౌడ్ అన్నారు. ఈ సన్మాన కార్యక్రమాలలో పోషబోయిన మల్లేశం, నియోజకవర్గ సాధన సమితి కార్యదర్శి గడ్డం యాదగిరి, ఏండి. ఫజల్, నకరెకంటి అశోక్, బోయిన ఆనంద్, పెండెం రవీందర్, పోచబోయిన మల్లేష్, దండుగుల రాములు, వనం చంద్రమౌళి, శ్రీరామోజీ నరసింహచారి, తదితరులు పాల్గొన్నారు.

Tags: