వాహనం ఢీకొని యాచకురాలు మృతి 

 విశ్వంభర,  మేడిపల్లి :  మేడ్చల్ జిల్లా  మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని  చెంగిచెర్ల క్రాస్ రోడ్ సమీపంలోని తులిప్స్ హోటల్ వద్ద ఆదివారం ఒక యాచకురాలిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా యాచకురాలు అక్కడికక్కడే మృతి చెందింది.  స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని  గాంధీ హాస్పిటల్ కు తరలించారు .

Tags: