ప్రెస్ క్లబ్ భవనంలో  భాగస్వామ్యం కల్పించాలి    

ప్రెస్ క్లబ్ భవనంలో  భాగస్వామ్యం కల్పించాలి    

  • ఉప్పల్ ప్రెస్ క్లబ్(పి అండ్ ఈ ) ప్రతినిధుల విజ్ఞప్తి

       - విశ్వంభర, ఉప్పల్:  ప్రెస్ క్లబ్ భవనం లో తమకు భాగస్వామ్యం కల్పించాలని లేదా స్వాధీనం చేసుకోవాలని కోరుతూ సోమవారం ఉప్పల్ మీడియా క్లబ్ అధ్యక్షులు వడ్డేపల్లి కిషోర్, ఉప్పల్ ప్రెస్ క్లబ్(పి &ఈ ) మీడియా క్లబ్ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఉప్పల్ జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఎమ్మార్వో, ఏసీపీ, ఉప్పల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు వినతి పత్రాలు అందజేశారు.ఉప్ప‌ల్ మెయిన్ రోడ్డు పక్క‌న ఉన్న మున్సిపాలిటీకి చెందిన స్థ‌లంలో  సుమారు ప‌దేళ్ల క్రితం ఉప్ప‌ల్ ప్రాంతంలో ప‌ని చేసే జ‌ర్న‌లిస్టుల‌మంతా క‌లిసి ఉమ్మ‌డిగా ప్రెస్ క్ల‌బ్‌ను నిర్మించుకున్నాము. కానీ ఇటీవ‌ల ఆ ప్రెస్ క్ల‌బ్ మూడు క‌మిటీ(క్ల‌బ్‌)లుగా  చీలింది. అయినప్పటికీ ప‌ది మంది స‌భ్యులు కూడా లేని  ఒక క‌మిటీ వారు దౌర్జ‌న్యంగా క్ల‌బ్‌ను స్వాధీనం చేసుకొని క్లబ్ కు సంబంధించిన తాళాలతో భ‌వ‌నాన్ని సైతం ఆక్రమించుకొని ఉన్నారు.ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియాలో ప‌ని చేస్తున్న సుమారు 85 మంది స‌భ్యులున్న మమ్ముల్ని  ప్రెస్‌ క్ల‌బ్‌లోకి రానివ్వ‌డం లేదని, తాళాలు కూడా ఇవ్వ‌డం లేదని, మున్సిపాలిటీకి సంబంధించిన‌ స్థ‌లంలో ఉమ్మ‌డిగా నిర్మించుకున్న ప్రెస్ క్ల‌బ్ భ‌వ‌నంలోకి మీడియాలో ప‌ని చేస్తున్న అంద‌రూ వెళ్లెలా అవ‌కాశం కల్పించాలని, ఇదే ప్రెస్ క్ల‌బ్‌లో స‌భ‌లు, స‌మావేశాలు మేము సైతం నిర్వ‌హించుకునేందుకు  తాళాలు ఇప్పించాలని నూతనంగా ఏర్పాటైన ఉప్పల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా క్లబ్ సభ్యులు అధికారులకు విజ్ఞప్తి చేశారు.  ప‌క్షంలో ప్రెస్ క్ల‌బ్ ఆక్ర‌మించుకొని ఉన్న మున్సిపాలిటీ స్థ‌లాన్ని, భ‌వ‌నాన్ని  మున్సిపాలిటీ వారే స్వాధీనం చేసుకోవాల్సిందిగా చ‌ర్య‌ల‌కు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags: