లేబర్ కోడ్స్ ప్రతులు దగ్ధం
విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని కోర్టు ముందు టియుసిఐ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు లేబర్ కోడ్ అమలు చెయ్యొద్దని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ ప్రతులను తగలబెట్టారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టియుసిఐ రాష్ట్ర అధ్యక్షులు కే . సూర్యం హాజరయ్యారు . అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సూర్యo మాట్లాడుతూ, పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ను తెచ్చి ఏప్రిల్ ఒకటవ తారీకు అమలుకు పూనుకున్నదని అ న్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేబర్ కోడ్స్ ను అమలు చేయొద్దనీ డిమాండ్ చేశారు. శాసనసభలో లేబర్ కోడ్స్ అమలు చేయకుండా తీర్మానం చేయాలన్నారు. పారిశ్రామిక సంబంధాల కోడ్, వేతన కోడ్ , సామాజిక భద్రత కోడ్ వృత్తిపరమైన భద్రత ఆరోగ్యం పని పరిస్థితుల కోడ్ ఈ నాలుగు లేబర్ కోడ్స్ కార్మికులకు తీవ్రమైన నష్టదాయకమని అన్నారు. లేబర్ కోడ్ లతో కార్మిక సంఘం ఏర్పాటు చేసుకునే హక్కును లేకుండా చేస్తుందన్నారు. మహిళలను రాత్రి వేళలో పనిచేసుకునేందుకు అవకాశం కలిపిస్తుందన్నారు. భవన నిర్మాణంలో ఎక్కువమంది మహిళాలే ఉన్నందున వారి భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉన్నది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి బిళ్ళకంటి సూర్యం, జిల్లా నాయకులు శ్రీరాంపుల్లయ్య, పూజల లచ్చయ్య, నేరెళ్ల బలరాం, వ్యవసాయం కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఉమ్మగాని సత్యం,తో పాటు బోయిని ఉప్పలయ్య, సూరన్న తదితరులు పాల్గొన్నారు .



