రోడ్డుపై బైఠాయించిన పేరెంట్స్

రోడ్డుపై బైఠాయించిన పేరెంట్స్


  •  - సిద్ధార్థ స్కూల్ ఫీజు పెంపుపై నిరసన 

 విశ్వంభర, బోడుప్పల్: మేడ్చల్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్లో గల సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో  ఫీజులు విపరీతంగా  పెంచి చదువుతో వ్యాపారం చేస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. బ్రాండ్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను బాదుతున్న సిద్ధార్థ స్కూల్ యాజమాన్యం అడ్మిషన్లు తీసుకున్నప్పుడు ఫీజు పెంపుపై సరైన వివరణ ఇవ్వలేదని, కానీ నేడు 20 నుండి 25 శాతం ఫీజులు పెంపు చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసారు. తమకు న్యాయం చేయాలని స్కూల్ యాజమాన్యాన్ని కోరినా  సరైన వివరణ ఇవ్వకుండా వెళ్లిపోయిన సిద్ధార్థ స్కూల్ యాజమాన్యం. స్కూల్లోనే విద్యార్థులకు బుక్స్, స్టేషనరీ అధిక ధరలకు అమ్ముతు వ్యాపారం చేస్తున్నరని, ప్రతి సంవత్సరం స్కూల్ ఫీజులు పెంచుతూ తల్లిదండ్రులపై అధిక భారాన్ని మోపుతున్నారని అడ్మిషన్ టైం లో ఒకలా తరువాత మరోలా యాజమాన్యం మాట్లాడుతున్నారని, ఎన్నిసార్లు ఫీజు విషయం మాట్లాడిన సిద్ధార్థ స్కూల్ యాజమాన్యం పట్టించుకోవడంలేదని, పెంచిన ఫీజు తగ్గించాలని  కోరుతూ లెటర్ రాసి సంతకాలు చేసి స్కూల్ యాజమాన్యానికి ఇవ్వడం జరిగిందని తెలిపారు. దాదాపు ఈ ధర్నాలో 100 మందికి పైగా విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. తమకు సరైన వివరణ ఇవ్వాలని లేకపోతే  పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు.

Tags: