రామలింగేశ్వర ఆలయానికి ఏసీ బహూకరణ 

రామలింగేశ్వర ఆలయానికి ఏసీ బహూకరణ 

విశ్వంభర,  మోత్కూరు : మోత్కూర్ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి  మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నూనెముంతల విమలా వెంకటేశ్వర్లు దంపతులు  రూ. 50,000  విలువైన ఏసీని  బహుకరించారు.  వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని గర్భాలయంలో  ఏసీ ఏర్పాటు కు ముందుకోచ్చిన మార్కెట్ కమిటీ చైర్మన్ నూనెముంతల విమలా వెంకటేశ్వర్లు దంపతులను ఆలయ కమిటీ చైర్మన్ గుండగోని రామ చంద్రు గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి అవిశెట్టి అవిలుమల్లు, ఆలయ కమిటీ ప్రతినిధులు బుర్ర యాదయ్య, పట్టూరి అంజయ్య, బయ్యని రాజు, బుర్ర నర్సయ్య,బందేల రవి,ఉయ్యాల అంజయ్య, బోల్లేపల్లి సీతయ్య, బుర్ర కృష్ణ, తోట్ల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags: