ఘనంగా రాజస్థాన్ దినోత్సవ వేడుకలు 

ఘనంగా రాజస్థాన్ దినోత్సవ వేడుకలు 

విశ్వంభర, హైదరాబాదు : దేశ వికాసంలో రాజస్థాన్ ప్రజల పాత్ర ఎనలేనిదని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాదు సోమవారం లోక్ భవన్‌లో రాజస్థాన్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాదులో నివసిస్తున్న రాజస్థాన్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గవర్నర్ తన సతీమణితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  రాజస్థాన్‌కు దేశ సంస్కృతి, సంప్రదాయాల పరంగా ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. భగవాన్ శ్రీరాముని స్ఫూర్తితో రాజస్థాన్ ప్రజలు దేశ అభివృద్ధి, సాంస్కృతిక వికాసానికి విశేష సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. వేడుకల అనంతరం నిర్వహించిన రాజస్థాన్ సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాల్గొన్నవారు : శివ ప్రతాప్ శుక్లా, శశికిరణాచారి, ఇతర లోక్ భవన్ ఉన్నతాధికారులు, రాజస్థాన్ ప్రతినిధులు, హైదరాబాద్‌లోని రాజస్థాన్ సంఘ సభ్యులు.

Tags: