వరి కొనుగోళ్లపై ఇబ్బందులు పెట్టొద్దు
On
విశ్వంభర, సిద్దిపేట: రబీకి సంబంధించిన వరి ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా కొనుగోళ్లు చేయాలని జిల్లా కలెక్టర్ హైమావతి రైస్ మిల్లర్లకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లాలోని రైస్ మిల్లర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 2025-26 రబీ కాలానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 421వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. దాదాపు 5లక్షల 50వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ఏ రోజుకారోజు వరిధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు రవాణా చేస్తామని తెలిపారు. సమావేశంలో పౌర సరఫరాల అధికారి తనూజ, మేనేజర్ గోపికృష్ణ, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.



