దొడ్డి కొమురయ్య ఉత్సవ కమిటీ సభ్యులుగా మల్లేష్ 

దొడ్డి కొమురయ్య ఉత్సవ కమిటీ సభ్యులుగా మల్లేష్ 

మేడిపల్లి, విశ్వంభర: తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా మరింత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కమిటీని ప్రకటించింది. ఈ కమిటీలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ సర్కిల్‌కు దేవేందర్నగర్ కాలనీకి చెందిన మరాటి మల్లేష్ కురుమను సభ్యునిగా నియమించింది. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో దొడ్డి కొమురయ్య కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆయన త్యాగస్ఫూర్తిని యువతకు పరిచయం చేయడం, పోరాట చరిత్రను ప్రజల్లో విస్తృతంగా చాటిచెప్పడం లక్ష్యంగా ఈ కమిటీ పనిచేయనుందని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జయంతి, వర్ధంతి కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. మరాటి మల్లేష్ కురుమను కమిటీ సభ్యునిగా ఎంపిక చేయడం పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు,కురుమ సంఘం నాయకులు,సామాజిక వర్గాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజలకు దగ్గరగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిటీలో అవకాశం కల్పించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యలకు మరాటి మల్లేష్ కురుమ కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కమిటీ లక్ష్యాల సాధనలో కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.

Tags: